Spread the loveమద్నూర్‌లో ఘనంగా శ్రీ హనుమాన్ మందిర పునఃప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో శ్రీ హనుమాన్ మందిర పునఃప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పునఃప్రాణ ప్రతిష్ఠతో పాటు ధ్వజస్తంభం, శిఖర స్థాపన, శివలింగం, నంది విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, గౌరీ గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, నవగ్రహ హోమం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. మద్నూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ మందిర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం భక్తుల సందడి మధ్య విజయవంతంగా పూర్తయింది. Post navigation SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఎక్కువ దిగుబడి అచ్చే సోయాబీన్ పంటను పరిశీలించిన మద్నూర్ AO రాజు మరియు సిబ్బంది