Spread the loveఈరోజు మద్నూర్ మరియు అవల్గోవ్ గ్రామాల్లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం ద్కింద,ఎఫ్ పీ వో (FPO) ద్వారా సోయాబీన్ తీసుకున్న రైతుల పొలాలను మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. సోయాబీన్ రకం DSB -34 మరియు MACS – 1460 రకాలు రైతులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సోయాబీన్ మంచిగా ఉందని, కాయలు మంచిగా కాస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో లు సౌమ్య శ్రీ , విశాల్ గౌడ్ ,సరోజ, రాజహిత మరియు రైతులు సంజయ్, రామచంద్ర,తదితరులు పాల్గొన్నారు. Post navigation మద్నూర్ లో ఘనంగా శ్రీ హనుమాన్ విగ్రహ పున:ప్రాణ ప్రతిష్ట మేనూర్ లో సోయాబీన్ మరియు ఆయిల్ ఫాం పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు