Spread the love

ఉమ్మడి మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి వేరు చేసి నిజామాబాద్ జిల్లాలో కలపాలనేది స్థానిక ప్రజల బలమైన డిమాండ్.
​గతంలో జిల్లాల పునర్విభజన సమయంలో 60 నుండి 70 కి.మీ. లోపు ఉన్న సమీప జిల్లాల్లోనే మండలాలను కలపాలనే నిబంధన ఉన్నప్పటికీ, అప్పటి ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను లేదా గ్రామసభలను పట్టించుకోలేదు. కేవలం సర్పంచుల ద్వారా తీర్మానాలు చేయించి, మద్నూర్ మండలాన్ని సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లాలో చేర్చారు.
MP ​సొంత గ్రామం నుండి నిజామాబాద్ 50 కి.మీ. దూరంలోనే ఉన్నా, అప్పటి ఎంపీ కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ సమస్యపై తక్షణమే స్పందించి, ప్రజల సౌకర్యార్థం ఉమ్మడి మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో విలీనం అయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *