Spread the love

డోంగ్లీ:
జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారి ఆదేశాల మేరకు డోంగ్లీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
​ఈ కార్యక్రమానికి డోంగ్లీ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపదలో ఉన్న బాధితులకు CMRF పథకం ఎంతో సహాయపడుతుందని, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారి చొరవతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేసి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *