Spread the love

మద్నూర్, సెప్టెంబరు 23: మద్నూర్ మండలంలోని రుషగాం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని పశు వైద్య అధికారి డాక్టర్ వినీత్ కుమార్, గ్రామ సర్పంచ్ సుమన్ రవి భూతాలే కలిసి ప్రారంభించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ వినీత్ కుమార్ రైతులకు పలు సూచనలు చేశారు. పశువులలో పాల ఉత్పత్తిని పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి పోషణ మరియు ఆరోగ్య సంరక్షణ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *