Spread the love

అందరికీ నమస్కారం
ఈరోజు మద్నూర్ రైతు వేదిక యందు రైతులతో  సమావేశమై , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రైతులకు టేకు వేర్లు పంపిణీ చేయడం జరిగింది. , మండలానికి 2000వేల టేకు వేర్లు రావడం జరిగింది.
మద్నూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి ఉష సంతోష్ మేస్త్రి గారు మండల వ్యవసాయ అధికారి రాజు రైతు వేదిక నుంచి టేకు వేర్లు రైతులు పంపిణీ చేయడం జరిగింది.
అలాగే మైనర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మండల వ్యవసాయ అధికారి రాజు పాల్గొని రైతుల పొలం గట్ల మీద టేకు వేర్లు పెట్టడం జరిగింది.
ఆయా క్లస్టర్ ఏఈవో ద్వారా గ్రామాల్లో ఈరోజు  రైతుల పొలాల గట్ల మీద నాటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఈవోలు విశాల్ , సౌమ్య శ్రీ, సరోజ, సంయుక్త , రాజహిత, అనిల్ పాల్గొన్నారు. ఎఫ్ పీ ఓ చైర్మన్ గోపాల్, మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *