Spread the loveమద్నూర్: దేశంలో వరుస పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రవేశ పరీక్షల లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని, బిజెపి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Post navigation మద్నూర్‌లో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కాటేజీల్లో చోరీ కేసు ఛేదన: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్