Spread the love

 

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుండి వరద నీరు వస్తున్న కారణంగా, ఈరోజు అనగా 24.08.2026 ఉదయం సుమారు 09:00 గంటలకు ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి, సుమారు 1000 క్యూసెక్కుల నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయడం జరుగుతుంది.

కావున కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్ల దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడమైనది.

ప్రత్యేకంగా, చేపలు పట్టే వారు, గొర్రెల కాపరులు, రైతులు, పశువుల కాపరులు మరియు ఇతర ప్రజలు కౌలాస్ నాలా వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. పశువులు, గొర్రెలు మరియు ఇతర మూగజీవులను కూడా వాగు పరివాహక ప్రాంతంలోకి వెళ్లకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *