Spread the loveమద్నూర్ మండలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని *బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి* గారు పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్, ఫైర్ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన మార్గంలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాఫిక్, అగ్నిప్రమాద నివారణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. Post navigation డీజేకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించిన మద్నూర్.ఎస్సై మోహన్ రెడ్డి ..! మద్నూర్ శ్రీరామ గణేష మండలి లో కుంకుమార్చన