Spread the loveడోంగ్లీ గ్రామానికి సమీపంలోని రాచన్న ఆలయానికి ముందున్న ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో తీవ్ర రాకపోకల విఘాతం ఏర్పడింది. పైనుంచి ముంచెత్తుతున్న నీటి ప్రవాహంతో చుట్టుపక్కల పంట పొలాలన్నీ సంపూర్ణంగా నీట మునిగిపోయాయి. రహదారిపైనుంచి ప్రవహిస్తున్న వరద కారణంగా నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు, స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వెంటనే ఓ వంతెన (బ్రిడ్జి) నిర్మిస్తే రాకపోకల సమస్య తీరడమే కాకుండా, పంట పొలాలు నీటమునగకుండా కాపాడుకోవచ్చని స్థానిక ప్రవీణ్ మేంగే, విట్టల్ అవుటే మరియు ఇతర రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. Post navigation డోంగ్లిలో నేత్రపర్వంగా ‘దహీ హండి’ కాలా వేడుకలు డొంగ్రి-కుర్లా మధ్య రహదారిపై చేరిన వరద నీరు: నిలిచిపోయిన రాకపోకలు!