Spread the love

డోంగ్లీ మండల కేంద్రంలో వేధిస్తున్న వీధి కుక్కల బెడదకు చెక్ పెట్టేందుకు గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సర్పంచ్ శ్రీమతి రేఖ శివాజీ పాటిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సవై సింగ్, కార్బారి దత్తు ఆధ్వర్యంలో శనివారం ‘డాగ్ క్యాచర్’ (కుక్కల పట్టే సిబ్బంది) సహాయంతో దాదాపు 100 వీధి కుక్కలను సురక్షితంగా పట్టుకున్నారు.
​మండలంలో పిచ్చి కుక్కలు, వీధి కుక్కల సంచారం ఎక్కువై ప్రజలు, చిన్నారులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. పట్టుకున్న కుక్కలను సురక్షితంగా సమీప అడవి ప్రాంతానికి తరలించారు. ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఈ సందర్భంగా పంచాయతీ వర్గాలు వెల్లడించాయి. కుక్కల భయం నుంచి ఉపశమనం లభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *