Spread the love మద్నూర్ మండల కేంద్రం మరియు కొట్చిర గ్రామాల్లో దేవాదాయ శాఖ – రెవెన్యూ శాఖల మధ్య* ఉన్న భూ సమస్యను RDO క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులు, హద్దులు, ఆక్రమణలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం *మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను* RDO గారు పరిశీలించారు. గ్రామంలో గ్రామస్థులతో మాట్లాడి సర్వే ప్రక్రియలో వస్తున్న ఇబ్బందులు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా సర్వే చేయాలని, ప్రతి పట్టాదారు భూమికి సరైన హద్దులు గుర్తించాలని సర్వే సిబ్బందికి సూచించారు. మండల తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ గారు, మండల గిర్దావర్ మురళీధర్, సర్వేయర్ వెంకట్, ఎండోమెంట్ అధికారులు, పాల్గొన్నారు Post navigation MLA సారు నమస్కారం మా మద్నూర్ ను నిజామాబాద్ జిల్లాలో కలపండి. ఉమ్మడి మద్నూర్ మండల ప్రజలు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి మరియు స్టాప్ ను అభినందించిన జిల్లా ఎస్పీ