Spread the love కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తడి హిప్పర్గామద్యం మహమ్మారి సృష్టిస్తున్న అలజడికి అడ్డుకట్ట వేసేందుకు ఒక గ్రామం ఏకమైంది. విచ్చలవిడి మద్యపానం వల్ల ప్రాణాలు కోల్పోతున్న యువతను కాపాడుకునేందుకు, కుటుంబాల్లో శాంతిని నింపేందుకు తడి హిప్పర్గా గ్రామస్తులు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ కె. అశ్విని గారికి గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. వాహనాల వేగం.. నిండు ప్రాణాల బలి: గ్రామంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో ఎంతోమంది యువకులు మద్యానికి బానిసలవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్తులో వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రమాదాల వల్ల కొందరు అక్కడికక్కడే మరణిస్తుండగా, మరికొందరు తీవ్ర అంగవైకల్యానికి గురై కుటుంబాలకు భారంగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు కుటుంబాల్లో నిత్యం గొడవలు, అటు రోడ్డు ప్రమాదాలతో గ్రామం అతలాకుతలమవుతోందని వారు వాపోయారు. కిరాణా దుకాణాలపై నిఘా – ఉల్లంఘిస్తే రూ. 5,000 జరిమానా: గ్రామ శ్రేయస్సు కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు అత్యంత కఠినంగా అమలు చేయనున్నారు. గ్రామంలోని ఏ కిరాణా దుకాణంలోనైనా మద్యం (సింధి, దారు) విక్రయించినా, లేదా ఎవరైనా తాగి పట్టుబడినా వారికి రూ. 25,000/- కఠిన జరిమానా విధిస్తామని హెచ్చరించారు.తెలియకుండా విక్రాస్తున్నారు అని తెలిపినవరికి 5000/-రూపాయలు బహుమతిగా అందేస్తాము అని ప్రకటించారు యువత భవిష్యత్తును, గ్రామం ప్రశాంతతను కాపాడటానికి గ్రామ పెద్దలు తీసుకున్న ఈ గట్టి నిర్ణయానికి ముఖ్యంగా మహిళల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మద్దతు తెలిపిన ముఖ్య సాక్షులు/గ్రామస్తులు: ఈ విప్లవాత్మక నిర్ణయానికి మద్దతుగా గ్రామానికి చెందిన సుమారు 45 మందికి పైగా పురుషులు, మహిళలు సంతకాలు చేసి సర్పంచ్‌కు అందజేశారు. Post navigation మద్నూర్ మండలం రుషేగావ్ లో ఉచిత పశు వైద్య శిబిరం… పశువైద్యాధికారి వినీత్ కుమార్ మద్నూర్ ICDS ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో పోషణ మాస సంబరాలు జరుపుకుంటున్న సిడిపిఓ మరియు సిబ్బంది