Spread the loveమద్నూర్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో ద్వాదశి సందర్భంగా శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెంకట మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు మహాప్రసాదాన్ని (అన్నదానం) పంపిణీ చేశారు. ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మద్నూర్ పట్టణం నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి విఠలేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకట మహారాజ్తో పాటు పలువురు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. Post navigation ఆశాడి ఏకాదశి నిమిత్తము మద్నూర్ విఠలేశ్వర మందిర్ లో పూజ డోంగ్లి PHC ఆధ్వర్యంలోHPV టీకలు