Spread the love

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తుతో పాటు కారు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బాన్స్వాడ రూరల్ సీఐ ఎ.తిరుపయ్య తెలిపారు.

​కక్షతోనే చోరీ:

పోలీసుల కథనం ప్రకారం… నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గోల్ బంగ్లా సమీపంలో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో గతంలో పనిచేసిన గట్టు రాకేష్ (29), తమ్మినేని లక్ష్మణ్ రావు (25)లు ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యానికి బానిసలై ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తమను తొలగించిన సంస్థ ఎండీ దీపక్‌పై కక్ష పెంచుకున్న నిందితులు, ఈ నెల 4న అర్ధరాత్రి కారులో వచ్చి కాటేజ్ తాళాలు పగులగొట్టి రూ.1.75 లక్షల విలువైన వెల్డింగ్ మిషన్లు, కట్టర్లు, ఉకో క్లిప్పర్ బాక్స్‌ను చోరీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *