Spread the love
  • డోంగ్లీ:
    కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని అన్ని గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్… ఈ మూడు నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మండల తహసీల్దార్ రంజిత్ కుమార్ తెలిపారు.
    ​రేషన్ కార్డుదారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, నిర్దేశిత సమయంలోగా తమకు కేటాయించిన బియ్యాన్ని తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. సరుకుల పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *