Spread the loveమద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ మరియు సేఖాపూర్ గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి రాజు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, కాబట్టి వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం ఉత్తమమని సూచించారు. ప్రత్యామ్నాయంగా పెసర, మినుము, నువ్వులు, సజ్జలు మరియు కూరగాయల వంటి పంటలను వేసుకోవడం ద్వారా రైతులకు సాగు నీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు సమయస్ఫూర్తితో పంటలను ఎంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్‌పేట్ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్, సేఖాపూర్ ఉప సర్పంచ్, ఏఈఓలు విశాల్, రాజహిత మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. Post navigation Hello world! జుక్కల్ నియోజకవర్గంలో వెల్లువలా ప్రజా సమస్యలు: హామీలు ఏమయ్యాయి ఎమ్మెల్యే గారు