Spread the love

14 సంవత్సరాలు దాటిన బాలికలకు
హెచ్ పి వి టీకా తో గర్భాశయ క్యాన్సర్ (సర్వేకల్ క్యాన్సర్) ను చెక్ పెట్టేలా ప్రభుత్వం ఉచితంగా హెచ్ పి  వి టీకాలను ఇస్తున్నట్లు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శ్రీలేఖ పేర్కొన్నారు. సోమవారం  మండల కేంద్రంలోని కస్తూరిబా విద్యాలయంలో  విద్యార్థులకు వైద్య సిబ్బంది టీకాలను వేశారు. హెచ్  పి వి టీకా అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న వ్యూమన్ పాపి లోమ వైరస్ వ్యాక్సిన్ ప్రస్తుతం బాలికలకు ఉచితముగా వేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *