Spread the love

వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ హెచ్చరిక
​మద్నూర్, జూలై 30:
ఉమ్మడి మద్నూర్, డోంగ్లీ మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో పరిధిలోని వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.
​ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని మద్నూర్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) మోహన్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా పొంగిపొర్లుతున్న వాగులు, దాటడానికి ఎవరూ సాహసించవద్దని ఆయన హెచ్చరించారు. మండలాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదకర ఘటనలు ఎదురైనా, తక్షణ సహాయం కోసం వెంటనే మద్నూర్ ఎస్‌ఐ మోహన్ రెడ్డి గారిని సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *