Spread the love

డోంగ్లి మండల కేంద్రంలో ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ భక్తులు, గ్రామస్థులు అత్యంత వైభవంగా ‘దహీ హండి’ కాలా కార్యక్రమాన్ని నిర్వహించారు. పండర్పూర్ తీర్థక్షేత్రాన్ని తలపించేలా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వికసించింది.
​ముందుగా హనుమాన్ మందిరం నుంచి విఠల్ మందిరం వరకు భక్తులు ప్రధాన వీధుల గుండా భజన కీర్తనలతో దిండి ప్రదక్షిణ చేపట్టారు. అనంతరం హనుమాన్ మందిర ప్రాంగణంలో కోలాహలంగా ‘దహీ హండి’ (ఉట్టి కొట్టే) వేడుకను నిర్వహించారు. భక్తుల విఠల నామస్మరణతో డోంగ్లి వీధులన్నీ మారుమోగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *