Spread the love

సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్న ‘రాష్ట్రీయ పోషణ్ మాహం – 2026’ పురస్కరించుకొని ఐసిడిఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో “గణపయ్య మండపంలో పోషణ మాస సంబరాలు 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గణనాథుని మండపాలలో స్వామివారికి సమర్పించే ప్రసాదాలతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ‘బజ్జి కూర’, తృణధాన్యాల (మిల్లెట్స్) పిండివంటలు, ఆకుకూరలు, పండ్లను ప్రత్యేక నైవేద్యంగా సమర్పించి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో భాగంగా cdpo కళావతి ,లోకల్ అంగన్వాడీ టీచర్స్ చంప, కళావతి,యమునా,genda, సుశీల,చంద్రకళ,మాధవి, స్రవంతి తల్లులు,పిల్లలు హాజరు అయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *