Spread the love

ఈరోజు మెనూర్ గ్రామంలో రైతు వేదిక యందు గ్రామ రైతులకు ఆత్మ సౌజన్యంతో  నూనె గింజల సాగు మరియు ఆయిల్ పామ్ సాగుపై  మండల వ్యవసాయ అధికారి రాజు మరియు kvk రుద్రుర్ శాస్త్రవేత్త శ్రీ ఇందుధర్ రెడ్డి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పథకం ద్వారా సోయాబీన్ రకం. DSB -34 మరియు MACS  -1460   మీద  సస్యరక్షణ చర్యలు రైతులకు కల్పించడం జరిగింది.
అలాగే క్లస్టర్ డిమాన్స్టేషన్  ద్వారా kvk రుద్రుర్ శాస్త్రవేత్త శ్రీ ఇందుధర్ రెడ్డి గారి రైతులకు కంది పంటపై అవగాహన మరియు సస్యరక్షణ చర్యలను రైతులు తెలియజేస్తూ, రైతులకు  నానో డిఏపీ ని పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం సోయాబీన్ మరియు ఆయిల్ పామ్ సాగు పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్ మల్కజీ, FPO చైర్మన్ చట్లవర్ గోపాల్, ఏఈవో విశాల్ గౌడ్, రాజహిత,  రైతులు గోపాల్, భీమ్ రావు,నాగ్నాథ్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *