Spread the loveడోంగ్లి (కామారెడ్డి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారము జుక్కల్ నియోజకవర్గ డోంగ్లి తహసిల్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి నేరుగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ రంజిత్ కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. Post navigation SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి .. డోంగ్లీ తహసిల్దార్ రంజిత్ కుమార్ కుమార్! ఈ నెల 30న డోంగ్లీ మండలం లోని హసన టాకిలి గ్రామంలో అన్న బాబు సాటే విగ్రహ ఆవిష్కరణ