Spread the love14 సంవత్సరాలు దాటిన బాలికలకు హెచ్ పి వి టీకా తో గర్భాశయ క్యాన్సర్ (సర్వేకల్ క్యాన్సర్) ను చెక్ పెట్టేలా ప్రభుత్వం ఉచితంగా హెచ్ పి వి టీకాలను ఇస్తున్నట్లు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శ్రీలేఖ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ విద్యార్థులకు వైద్య సిబ్బంది టీకాలను వేశారు. హెచ్ పి వి టీకా అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న వ్యూమన్ పాపి లోమ వైరస్ వ్యాక్సిన్ ప్రస్తుతం బాలికలకు ఉచితముగా వేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పుష్ప వైద్య సిబ్బంది రేణుక ఉదయ్ తదితరులు పాల్గొన్నారు Post navigation పి హెచ్ సి డోంగ్లి ఆధ్వరంలో మద్నూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్* 👉 *కల్లు దుకాణాలు, దాబాలు, రైస్ గోదాముల్లో విస్తృత తనిఖీలు.