Spread the love

 

డీజేకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించడంతో ఆందోళన చెందిన గణేష్ మండలి నిర్వాహకులకు అండగా నిలిచారు పోలీసులు. రెండు నెలల క్రితం డీజే కోసం ఇచ్చిన రూ.5 వేల అడ్వాన్స్‌ను పోలీసుల చొరవతో తిరిగి ఇప్పించడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం మరేపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఏకదంత గణేష్ మండలి నిర్వాహకులకు పోలీసులు సహకరించారు.
మండలి నిర్వాహకులు శంకర్, శుభం రెండు నెలల క్రితం జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి డీజే కోసం రూ.5 వేల అడ్వాన్స్ ఇచ్చారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే ఏర్పాటు చేయవద్దని పోలీసులు సూచించడంతో నిర్వాహకులు డీజే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
దీంతో తాము ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులను తిరిగి ఇప్పించాలని గణేష్ మండలి నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, పోలీసు సిబ్బంది సహకారంతో డీజే కోసం అడ్వాన్స్ తీసుకున్న వ్యక్తులను పిలిపించి అవగాహన కల్పించారు.
అనంతరం రూ.5 వేల అడ్వాన్స్ మొత్తాన్ని గణేష్ మండలి నిర్వాహకులకు తిరిగి ఇప్పించారు. దీంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్సై మోహన్ రెడ్డికి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని ఎస్సై మోహన్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *