Spread the love

మద్నూర్: మండల కేంద్రంలోని శ్రీ గంగశెట్టి హనుమాన్ మందిరంలో శ్రీ వరలక్ష్మీ వ్రత పూజలు శుక్రవారం శ్రావణమాస మహోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ మహారాజ్, మహేష్ మహారాజ్ వేద మంత్రోచ్చారణల నడుమ వ్రత కథను పఠించి, పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేయించారు. అనంతరం భక్తులు పాల్గొనగా మహా హారతి కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తజనం పెద్ద సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *