Spread the loveమద్నూర్ లో13 న యువ సమ్మేళనం….. మద్నూర్ వందేమాతరం గీతం ఒక 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం శతాబ్ది ఉత్సవంలో భాగంగా జాతీయ భావాలు, దేశభక్తి, సామాజిక బాధ్యతపై యువతలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 13న యువ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పతాంజలి యోగా ఫీట్ సభ్యులు జూబ్రే సంజయ్ తెలిపారు.మద్నూర్ మండల కేంద్రంలోని మైధిలి ఫంక్షన్ హాల్ లో గురువారం మధ్యాహ్నం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర, జాతీయ సమైక్యత, సామాజిక సేవ తదితర అంశాలపై సమ్మేళనంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడమే సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. Post navigation యువ సమ్మేళనానికి తరలిరండి.. *13న మద్నూర్ లో యువ సమ్మేళనం.. మద్నూర్‌లో వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు